ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!

ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈరోజు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి కావటంతో పలు పథకాలను రంగం సిద్దం చేసారు. రాజశేఖర్‌ రెడ్డి జయంతిని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.

ఏపీ సీఎం జగన్ ఈ రోజు మరిన్ని ప్రజాకర్షక పథకాలకు బీజం వేయనున్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదలకు, రైతులకు చేయూతనిచ్చే పనులకు శ్రీకారం చుట్టునున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు అనుకునే సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకొని వచ్చారు. అనంతరం సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆయన.. రైతు బంధుగా పేరు తెచ్చుకున్నారు.

దీంతో ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని జగన్ సర్కారు నిర్ణయించింది. తండ్రి జయంతిని సీఎం హోదాలో.. కుమారుడు ఇలా ఓ పండుగలా నిర్వహించనుండటం ఏపీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఈరోజు రైతు దినోత్సవ వేడుకులను పులివెందులలో ప్రారంభించనున్నారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ లాంచనంగా ప్రారంభిస్తారని.. రైతులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కోరారు.

మరోవైపు గత ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ప్రకటించిన సైకిళ్లను కూడా జగన్ సర్కార్ తన తండ్రి జయంతి సందర్భంగా అందించనుంది. టీడీపీ ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఎన్నికల కోడ్ విడుదల కావటంతో… కార్యరూపం దాల్చలేదు. వాటిని రాజన్న బడిబాట కార్యక్రమం కింద పంపిణీ చేయాలని సంబందిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ హయాంలో రైతులకు, విద్యార్థులకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా జగన్ సర్కార్ కూడా రైతులకు, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రకటనలు జారీ చేయనున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *