జగన్ ఉగాది కానుక..మహిళలకు ఇంటి పట్టాలు!

జగన్ ఉగాది కానుక..మహిళలకు ఇంటి పట్టాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త కొత్త నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలకు మేలుచేసే నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం జరిగిన తొలి కలెక్టర్ల సదస్సు..ప్రజావేదికలో మరో కీలక ప్రకటన చేసి ఆశ్చర్యానికి గురిచేశారు.

దగ్గరుండి చూపించాలి!

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి నిర్వహించిన ప్రజావేదికలో…ఉగాది పండుగ రోజున గ్రామాల్లోని మహిళలకు 25 లక్షల పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, ఇంటి పట్టాల పంపిణీకోసం సమాయాత్తం కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ భూమి అందుబాటులో లేనట్టైతే కొనుగోలు చేయాలని తెలిపారు. ఇంటి పట్టా మాత్రమే కాదు వారికి ఆ స్థలం ఎక్కడుందో స్పష్టంగా చూపించాలని తెలిపారు. ఈసార్ ఉగాది పండుగరోజున గ్రామాల్లో సంబరాలు మరింత గొప్పగా జరగాలని పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *