ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం..హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి!

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం..హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. కర్నాకట సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న విందు భేటీకి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *