రామోజీతో చంద్రబాబు భేటీ! కారణం ఇదేనా...

రామోజీతో చంద్రబాబు భేటీ! కారణం ఇదేనా...

రామోజీరావు సాధారణంగా నరనరాన కాంగ్రెసు వ్యతిరేకత నిండిన వ్యక్తి. అదే కాంగ్రెస్‌లో ఆయనకు చాలా మంచి మిత్రులున్నారు. అంతేకాదు…బీజేపీ అగ్రనాయకులతో కూడా ఆయనకు చాలా మంచి సంబంధాలున్నాయి. కష్టకాలంలో కూడా అవకాశాలను సృష్టించుకోగలరు రామోజీ రావు.రాజకీయాల్లో చంద్రబాబు కూడా అంతే. దీంతో వీరిద్దరూ భేటీ వెనుక చాలా కారణాలుంటాయి.భవిష్యత్తు చర్చలుంటాయి. ఏపీలో చంద్రబాబు బీజేపీకి దూరమయ్యారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశారు. అంతేకాదు..బీజేపీపై చంద్రబాబు కత్తులు నూరారు. మోదీని విలన్‌గా చెపుతూ దేశమంతా ప్రచారం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌తో రాసుకుపూసుకు తిరిగారు.

ఇప్పుడు కేంద్రంలో కాస్తోకూస్తో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏకే ఎడ్జ్‌ ఉంటుందని విశ్లేషనలు వెలువడుతున్నాయి. దీంతో..చంద్రబాబు స్పీడ్ తగ్గించుకోవాలని బాబుకు రామోజీ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచైనా బీజేపీకి అనుకూలంగా రూట్ క్లియర్‌ చేసుకోవాలనిబాబుకు రామోజీ సలహా ఇచ్చినట్లు సమాచారం. జరిగిందేదో జరిగి పోయింది బీజేపీకి దగ్గర కావాలని బాబుకు రామోజీ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో జగన్‌ ఇప్పటికే బీజేపీకి సానుకూలంగా ఉన్నారు. ఇక చంద్రబాబును కూడా తమ దారిలోకి తెచ్చుకోవాలని బీజేపీలోని కొంత మంది పెద్దల ఆలోచన ప్రకారమే ఈ భేటీ జరిగినట్లు పొలిటికల్ టౌన్‌లో చెప్పుకుంటున్నారు.

ఎన్డీయేతర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే చంద్రబాబు ఆలోచనను కమలనాధులు తట్టుకోలేకనోతున్నారు. చంద్రబాబు నాయుడు శక్తిసామార్ధ్యాలు ఏంటో బీజేపీ నేతలకు బాగా తెలుసు. దేశంలోని బీజేపీయేతర రాజకీయ శక్తులు అన్నింటిని ఒకే కూటమి కిందకు తీసుకురాగల సమర్ధుడు. అందుకే..ముందరి కాళ్లకు బంధంలాగా కమలనాధులు అలర్ట్ అయ్యారని సమాచారం. ఇందులో భాగంగానే రామోజీని ముందపెట్టి గేమ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. యూపీఏను గద్దెనెక్కించడానికి బాబు చేస్తున్న ప్రయత్నాలకు రామోజీ ద్వారా బ్రేక్ వేయాలనే బీజేపీ నేతలు స్కెచ్‌గా చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు అచ్చమైన ఆరు అణాల పొలిటిషియన్‌ . లాభం లేకుండా ఒక్క అడుగు కూడా ముందడుగు వేయడు. సైలెంట్‌గా ఉంటే తనకు లాభం ఏంటని కూడా రామోజీని బాబు అడిగి ఉండొచ్చు. దానికి తగ్గ ఫలితం ఉంటుందని రామోజీ రావు …బాబుకు కచ్చితంగా హామీ ఇచ్చి ఉంటారని తెలుగు పొలిటికల్ లోగిళ్లలో అనుకుంటున్నారు. రాజగురువు సలహాను బాబు పాటిస్తారా లేదా అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *