25 మందితో ఏపీ కేబినెట్‌

25 మందితో ఏపీ కేబినెట్‌

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన వైయస్సార్‌ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ముందుగా పార్టీ బలోపేతం సహా ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌ కన్ఫామ్‌ చేసింది.. ఎందుకు చేస్తున్నది కూడా కూలంకుశంగా వివరిస్తున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్‌ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా నియమిస్తున్నట్లు సమాచారం. మొత్తం 25 మందితో కేబినెట్‌ ఏర్పడనుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రధాన్యతనిచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *