ఏపీ కేబినెట్ భేటీ...8 అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ భేటీ...8 అంశాలపై చర్చ

ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రైతులు, మహిళలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే అజెండాగా జగన్‌ కేబినెట్ మీట్‌ సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. ఇప్పటికే అమలులోకి తెచ్చిన పథకాలు, త్వరలో అమలు చేయబోతున్న స్కీమ్స్‌, రైతుల కోసం నిధుల కేటాయింపులు, రాష్ట్రంలోని ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు… ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

వృద్ధాప్య పింఛన్లు 2250కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌లో ఆమోదిస్తారు. అలాగే ఆశా వర్కర్ల వేతనాలను 10వేలకు పెంపు నిర్ణయానికీ అంగీకారం తెలుపుతారు. ఆ తర్వాత, ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, మునిసిపల్‌ శానిటరీ పనివారాల వేతనాలు పెంపు, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, రైతు బంధు పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, సీపీఎస్ రద్దుపై కేబినెట్‌లో చర్చించి.. ఆమోదించనున్నారు.

ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా 12వేల 500 రూపాయలు ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నప్పటికి ఈ రబీ నుంచే అందివ్వాలని, ఈ మేరకు తొలి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయడానికి సీఎం ఒక అడుగు ముందుకు వేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *