ఈ నెల పదో తేదీన ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల పదో తేదీన ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల పదో తేదీన ఏపీ కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈమేరకు భేటీ అజెండాను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎంఓ సూచించింది. ఫోని తుపాను ప్రభావం, నష్టపరిహరం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, వేసవిలో మంచి నీటి ఎద్దడి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అజెండాకే పరిమితం అవుతుందా..? లేదా బిజినెస్ రూల్స్ మీదా చర్చిస్తుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్టు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం రియాక్షన్‌పై ఆస్తకి నెలకొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *