ఏపీ కేబినెట్‌ భేటీ

ఏపీ కేబినెట్‌ భేటీ

కాసేపట్లో ఏపీ ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించనుంది. రూ. 2.27 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండే అవకాశం ఉందని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే వెయ్యి కోట్లు అదనంగా ఉంటుందని సమాచారం. వ్యవసాయ బడ్జెట్ రూ.28 వేల కోట్లతో తయారు చేసినట్లు సమాచారం. మేనిఫెస్టోలో ‘నవరత్నాల’ పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రధాన కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అమ్మఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారని తెలిసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *