సున్నా వడ్డీపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

సున్నా వడ్డీపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

సున్నా వడ్డీ పథకంపై సభను సీఎం తప్పుదోవపట్టించారని టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందని అది అవాస్తవమన్నారు. అవాస్తవాలతో సీఎం జగన్‌ ఛాలెంజ్‌ చేశారని రామానాయుడు విమర్శించారు. 2014-16 వరకు సున్నా వడ్డీ అమలు చేసినట్టు ఎస్‌ఎల్‌బీసీకి అధికారులు లేఖ రాశారన్నారు. ఐదేళ్లలో సున్నా వడ్డీ పథకానికి 415 కోట్లు చెల్లించామని రామానాయుడు స్పష్టం చేశారు. రికార్డులు చూడకుండా జగన్‌ అవాస్తవాలు చెప్పారన్నారు. సభను తప్పుదోవపట్టించినందుకు ప్రజలకు జగన్‌ క్షమాపణలు చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *