జగన్ సర్కారు తొలి పద్దు

జగన్ సర్కారు తొలి పద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..

* దేశ నిర్మాణంలో తనకూ పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తీ గ్రహించాలనే జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యల స్ఫూర్తితో బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

* పోలవరం, వంశధార, హంద్రీనీవ ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యం.

* ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యం.

* బడ్జెట్ అంచనా రూ.2.27,974.99 కోట్లు

* మూలధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు

* వడ్డీ చెల్లింపులు రూ. 8,994 కోట్లు

* రాష్ట్ర రుణం 2014తో పోలిస్తే.. 2019 నాటికి విపరీతంగా పెరిగిపోయింది.

* రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు

* ద్రవ్యలోటు సుమారు రూ. 35,260.58 కోట్లు

* 2018-19తో పోలిస్తే బడ్జెట్ 19.32 శాతం పెరుగుదల.

* ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని కోరుతున్నాం: బుగ్గన

* హోదా వచ్చి ఉంటే 2020 నాటికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచి ఉండేది – బుగ్గన.

* 2022 నాటికి ఏపీ వృద్ధిపథంలో ఏ స్థానంలో ఉంటుందనే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు నిర్ధారిస్తుంది.

* సింగపూర్‌కు విమాన సర్వీసులను నడపడానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలా..? లేదంటే తల్లులకు పోషకాహారం అందించడం ముఖ్యమో మేం నిర్ణయించుకున్నాం – బుగ్గన.

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

* వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.8750 కోట్లు, 15 లక్షల మంది కౌలు రైతులు సహా రైతులందరికీ అక్టోబర్ 15 నుంచే రైతు భరోసా.
* వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు: రూ.100 కోట్లు
* వైఎస్ ప్రధాని ఫసల్ యోజన పంట బీమా: రూ.1163 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధి: రూ.3 వేల కోట్లు
* ఉచిత బోరు బావుల తవ్వకం: రూ.200 కోట్లు
* గ్రామ సచివాలయాలు: రూ.700 కోట్లు
* ఆర్టీసీకి సాయం : రూ.1000 కోట్లు
* రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ : రూ. 260 కోట్లు
* పౌరసరఫరాల కార్పొరేషన్‌‌కు ఆర్థిక సాయం: రూ.384 కోట్లు
* బీసీ సంక్షేమం: రూ.7271 కోట్లు
* డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *