నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా..

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా..

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించారు. సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలిసారిగా జగన్ అండ్ కో బడ్జెట్ ప్రవేశపెట్టెందుకు సిద్ధమవుతున్నారు. సభా నిర్వహణపై బీఏసీ సమావేశంలో కూడా చర్చించారు. ఈ సమావేశాలు మొత్తం 14 రోజులపాటు జరగనున్నాయి. సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందు ఉంచుతారు.

ఈ బడ్జెట్‌పై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ వర్గానికి ఎలా కేటాయింపులు ఉంటాయనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు మధ్యలోనే ఆగిపోవటంతో వాటిని కొనసాగిస్తారా? లేదా అనే దానిపై సందేహాలు ఉన్నాయి. టీడీపీ హయాంలో చివరి రోజుల్లో వేలమంది ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటికి నిధులు విడుదల కాకపోవటంతో నిర్మాణాలు మధ్యలో ఉండిపోయాయి. ఈ విషయంలో స్పష్టత కోసం పలువురు ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఇరాకాటంలో పెట్టేందుకు టీడీపీ నేతలు పలు అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. రైతులుకు సకాలంలో విత్తనాలు అందకపోవటంతో కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు. దీనిపై ఇప్పటికే ఇరుపార్టీలు విమర్శలు చేసుకునే అవకాశం ఉంది. మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షం ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆశించే స్థాయిలో ఏపీకి కేటాయింపులు లేకపోవటంతో…టీడీపీ ఈ విషయంలో వైసీపీని కార్నర్ చేసే అవకాశం ఉంది. అయితే వైసీపీ కూడా దానికి తగ్గట్టు వ్యూహ రచన చేస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో తామేంటో నిరూపించుకోనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *