రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు మొదలయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు…18న ముగియనున్నాయి.

ఐదు రోజుల‌పాటు జ‌రిగే ఏపి అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారం ఉద‌యం 11.05నిమ‌షాల‌కు ప్రారంభం కానున్నాయి. 15వ అసెంబ్లీ తొలి స‌మావేశాలు కావ‌డంతో అధికారులు స‌భ స‌జావుగా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. బుధ‌వారం కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీక‌ర్ గా ఎన్నికైన శంబంగి చిన వెంక‌ట అప్ప‌ల‌నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. మొద‌టి రోజు ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం పూర్తికాకుంటే గురువారం కూడా ప్ర‌మాణ‌స్వీకారంను కొన‌సాగించ‌నున్నారు. ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం పూర్త‌యిన వెంట‌నే స్పీక‌ర్ గా త‌మ్మినేని సీతారాం, డిప్యూటి స్పీక‌ర్ గా కొన ర‌ఘుప‌తిలు బాధ్య‌త‌లు స్వీకరించ‌నున్నారు. ఈనెల 14వ తేది గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఉభ‌య స‌భ‌లను ఉద్ధేశించి ప్ర‌సంగించ‌నున్నారు. అయితే 15, 16తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు. తిరిగి 17వ తేది ప్రారంభ‌మై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

కాగా శాస‌న‌మండ‌లి మాత్రం 14వ తేదిన ప్రారంభం కానుంది. 14వతేది బిఏసి మీటింగ్ లో స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నేదానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపు పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ అసెంబ్లీని 2017 ఏప్రిల్ లో జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో బుధ‌వారం అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ‌పై టిడిపి,జ‌న‌సేన‌, లెప్ట్ పార్టీలు దుమ్మెత్తిపోసినా వెనుతిర‌గ‌ని జ‌గ‌న్… సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 175అసెంబ్లీ స్థానాల‌కు 151స్థానాలు కైవ‌సం చేసుకుని తిరుగులేని ఆధిప్య‌తం సాధించారు. దీంతో అసెంబ్లీలోకి జ‌గ‌న్ అడుగుపెట్టే స‌మ‌యంలో వైసిపి ఎమ్మెల్యేలంతా లేచి నిల‌బ‌డి క‌ర‌తాల‌ధ్వ‌నుల‌తో ఘనంగా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఎమ్మెల్యేగా మొద‌ట ఫ్లోర్ లీడ‌ర్ ప్ర‌మాణం చేయడం ఆన‌వాయితీ …దీనికి అనుగుణంగా జ‌గ‌న్ ఫ‌స్ట్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. టిడిఎల్పీ నేత‌గా ఎన్నికైన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపక్ష‌నేత‌గా వ్య‌హ‌రించ‌నున్నారు. అయితే 23మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకున్న టిడిపి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమితం కావ‌డం యాధృక్షికం.

శాస‌న‌స‌భ‌లో సంఖ్యాబ‌లం తారుమారు కావ‌డంతో మాజీ మంత్రి లోకేష్ చాంబ‌ర్ ను టిడిఎల్పీకి కేటాయించారు. మాజీ ఉప‌స‌భాప‌తి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ చాంబ‌ర్ ను మాజీ సిఎం చంద్ర‌బాబుకు కేటాయించారు. టిడిఎల్పీ హాలును వైఎస్సార్ ఎల్పీకి కేటాయించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *