ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు. అయితే కరువు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు ఆ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌… ప్రశ్నోత్తరాల సమయం అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకుని, కావాలనే టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బీఏసీలో నిర్ణయించినట్లుగానే సమావేశాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం కరువుపై చర్చిద్దామని మంత్రి బుగ్గన తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రాజెక్టులపై చర్చ మొదలైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *