నేడు శాసనసభ బీఏసీ సమావేశం

నేడు శాసనసభ బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ బీఏసీ సమావేశం ఈరోజు జరగనుంది. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి. ఏ విధంగా జరపాలని అనే దానిపై బీఏసీలో చర్చించనున్నారు. అయితే గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగానే బీఏసీ సమావేశాన్ని జగన్ సర్కార్ నిర్వహిస్తుంది.

ఈ నెల 12న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా విషయాలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్‌ చర్చించారు.

ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షపార్టీ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయం తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది. అలాగే విత్తనాల కొరత కూడా సభలో చర్చకు రానుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *