`ఆర్ఆర్ఆర్`లో అనుష్క‌..ఐదు నిమిషాలు..!

`ఆర్ఆర్ఆర్`లో అనుష్క‌..ఐదు నిమిషాలు..!

యోగా బ్యూటీ అనుష్క చిన్న పాత్రలో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కొంతమంది దర్శకుల్లో ఉంది. అందుకే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఈ బ్యూటీని గెస్ట్ పాత్రలో నటించమని టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేశాడు.. మరి ఆ సినిమాలో నటించేందుకు అనుష్క ఓకే చెప్పిందో లేదో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ….

మూడు పదులు దాటినా ఇప్పటికి కొత్త హీరోయిన్స్‌కు గట్టి పోటి ఇస్తుంది యోగా బ్యూటీ అనుష్క … ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటిన స్టార్ హీరోలతో నటిస్తునే , లేడి ఓరియేంటెడ్ సినిమాలు చేస్తు సక్సెస్ అందుకుంటుంది. అయితే సైజ్‌ జీరో సినిమా తరువాత లుక్స్‌పరంగా విమర్శలు ఎదుర్కొన్న అనుష్క, ఇటీవల తిరిగి గ్లామరస్‌ లుక్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సైలెన్స్‌లో నటిస్తుంది ఈ బ్యూటీ..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్ ఆర్‌ఆర్‌ఆర్‌. చారిత్రక కథకు ఫిక్షన్‌ జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో స్వీటీ అనుష్క నటించనుందట. రాజమౌళి అడిగిన వెంటనే సైలెన్స్‌ సినిమాలో నటిస్తున్న అనుష్కఒకే చెప్పిందట.. కీలక సందర్భంలో మూడు నాలుగు నిమిషాల పాటు అనుష్క కనిపించనుందని టాక్‌ వినిపిస్తోంది.ఇక సైరా నరసింహారెడ్డిలో అనుష్క తోని ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయించేందుకు అనుష్కని ఒప్పించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా మూవీతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా స్వీటీ నటిస్తుందన్న న్యూస్ వినిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *