అమెరికాలో మరో అనుష్క

అమెరికాలో మరో అనుష్క
మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే మాటను మన చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఆ ఏడుగురూ ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? ఏం చేస్తుంటారు ? అనే ప్రశ్నలూ చాలాసార్లు మన పెద్దవాళ్లను అడిగే ఉంటాం. అలా మాటల్లో వినడమే కానీ అచ్చంగా అచ్చుగుద్దినట్టు మనలానే ఉండే మనుషులు మనకు దాదాపుగా తారసపడరు. పోనీ ఏ ఇద్దరైనా ఒకేలా ఉన్నా ఇంత పెద్ద ప్రపంచంలో జల్లడేసి పట్టుకోవడం మహా కష్టమవుతుంది. ఈ విషయంలో సెలబ్రెటీలకు కొద్దిపాటి వెసులుబాటు ఉంది. అచ్చంగా భారతీయ నటి అనుష్కాలానే ఉండే అమెరికా స్టార్ సింగర్‌ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.

వేరువేరు ప్రపంచాలు…

ఆమె పేరు జులియా మైకేల్స్‌. పాట పాడిందంటే ఎవరైనా సరే అభిమానులైపోవాలి. ఇప్పుడిప్పుడే అమెరికాలో బాగా క్రేజ్‌ తెచ్చుకుంటోంది. ఈమె పేరు అనుష్కా శర్మ. భారతీయలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు. తన అభినయంతో కోట్ల మంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది. వీరిద్దరవీ వేరువేరు ప్రపంచాలు. ఒకరు అమెరికా పాప్‌ సింగర్‌. మరొకరు భారతీయ నటి. అయితే వీరిద్దరి ఫోటోలూ పక్కపక్కన పెట్టిన సోషల్‌మీడియా పోస్ట్ పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతోంది.

 

 
 
 
View this post on Instagram
 
 

 

Aus makin my hair extra floofy

A post shared by Julia Michaels (@juliamichaels) on

అవే పోలికలు…

వీరిద్దరూ ఒకే పోలికలు కలిగి ఉండటంతో ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది. జులియా మైకేల్స్ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అలా షేర్‌ చేసీచెయ్యగానే కామెంట్ల వర్షం మొదలైంది. చాలా మంది అక్కడ అనుష్కను ట్యాగ్ కూడా చేస్తున్నారు. వీరిద్దరినీ పక్కనపక్కన పెడితే… అనుష్క భర్త విరాట్ కూడా వీరిలో ఎవరు అనుష్కానో గుర్తపట్టలేడనీ, అనుష్కాకు అమెరికాలో చెల్లి ఉందనీ, వెస్ట్రన్‌ వెర్షన్‌ అనుష్క అనీ… నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *