క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌

క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌

అనూ ఇమ్మాన్యుయేల్ లుక్స్‌కు పడిపోయిన కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అమ్మడి చూపులకు సినీజనాల్లోనూ క్లీన్ బౌల్డ్ అయిన వాళ్ళూ ఉన్నారు. అందుకే అను షార్ట్‌టైం లోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లు అందుకుంది. మజ్ను సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి త్వరగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లో అవకాశం వచ్చింది. పవర్‌స్టార్‌తో నటిస్తోంది కాబట్టి ఈ హీరోయిన్ టాప్ లీగ్ లోకి అడుగుపెడుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. దీంతో అల్లు అర్జున్ నాపేరు సూర్య పై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఈ చిత్రం బన్నీవన్ మేన్ షో కావడంతో అనూ కెరీర్‌పై కాస్త వెయిట్ పడింది.

అనూ ఇమ్మాన్యుయేల్ పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపిస్తుంది. పైగా స్కిన్ షోలో కండీషన్స్ కూడా పెద్దగా పెట్టదు.. టాప్ హీరోలతో నటించినా కూడా అమ్మడి కెరీర్ స్లంపులో పడ్డాడానికి అనూ పెర్ఫామర్‌గా ప్రూవ్ చేసుకోలేకపోవడమే కారణమంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో సత్తా చాటుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ కు కోలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.‌. మరి ఈ సినిమా అనూ ఫ్యూచర్‌ని బ్రైట్‌గా మార్చే చిత్రమేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *