‘అంతరిక్షం’ మూవీ రివ్యూ

‘అంతరిక్షం’ మూవీ రివ్యూ

పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో కొత్త సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించిన అంతరిక్షం సినిమా, ఇండియన్ సాటిలైట్ మిహిరా ట్రాక్ మిస్ అవ్వడంతో మొదలవుతుంది. ట్రాజెక్టరీ పాత్ మిస్ అయిన మిహిరా వేరే సాటిలైట్ ని ఢోకినే పరిస్థితి తలెత్తుతుంది, అదే జరిగితే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ అంతా దెబ్బ తింటుంది. సో మిహిరాని తన పాత్ లోకి మళ్లీ తీసుకొచ్చి ప్రపంచదేశాల ముందు ఇండియాని తలెత్తుకునేలా చేయడం ఇండియన్ స్పేస్ సెంటర్ ముందున్న ప్రధమ లక్ష్యం. ఈ మిషన్ ని కంప్లీట్ చేయడానికి మన స్పేస్ సెంటర్ కి దేవ్ అవసరం వస్తుంది కానీ అయిదేళ్ల క్రితం కొన్ని కారణాల వలన స్పేస్ సెంటర్ వదిలి వెళ్లిన దేవ్, మిహిరాని సెట్ చేయడానికి సహకరించడు. ఇలాంటి పరిస్థితిలో రియా, దేవ్ ని కన్వీన్స్ చేసి తిరిగి స్పేస్ సెంటర్ కి తెస్తుంది. ఇక్కడ నుంచి మొదలైన దేవ్ అండ్ టీమ్ ప్రయాణం మిహిరాని సెట్ చేశారా లేదా? ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎదురైన సవాళ్లు ఏంటి? దేవ్ స్పేస్ సెంటర్ వదిలి వెళ్లడానికి కారణాలు ఏంటి? అనే పాయింట్స్ తో అంతరిక్షం సినిమా తెరకెక్కింది. 

antariksham movie review

క్యూరియాసిటీ…

రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లో లాగే ఇందులో కొత్త కాన్ఫ్లిక్ట్ తో అంతరిక్షం సినిమా సాగుతుంది, మూవీ మొదలైన నిమిషాల్లోనే కథలోకి వెళ్లిపోవడంతో ఎక్కడా సినిమా మెయిన్ పాయింట్ నుంచి డీవియేట్ అయినట్లు అనిపించదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ ట్రాక్ వచ్చినా కూడా కథన ప్రయాణం గతంలో ఏం జరిగింది? ఎందుకు దేవ్ స్పేస్ సెంటర్ వదిలి వెళ్లిపోయాడు అనే క్యూరియాసిటీ మైంటైన్ చేశారు, టువార్డ్స్ సెకండ్ హాఫ్ వెళ్తున్నప్పుడు ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా గ్రిప్పింగ్ గా ఉంది. ఏం జరగబోతుంది, దేవ్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది ముందే తెలిసి పోవడంతో కొంచెం నిరాశపరిచే అంశమనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమాల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉండాలి కానీ అంతరిక్షం సినిమాలో అది కొంచెం తగ్గిందనే చెప్పాలి. 

antariksham movie review

కథే హీరో…

ఎన్నో శాటిలైట్స్ కి సక్సస్ ఫుల్ గా కోడింగ్ చేసిన పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు, తన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇలాంటి డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ సినిమాలు చేస్తే వరుణ్ అతి త్వరలో ఫేస్ ఆఫ్ మెగాఫామిలీ అవుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రయోగాలు చేసే అప్పుడు కొన్ని రిస్క్స్ ఉన్నా కూడా వెనకడుగు వేయకుండా, కథని నమ్మి అతను చేస్తున్న ప్రయాణం బాగుంది. ఇక రియా పాత్రలో ఒదిగిపోయిన అదితి రావ్ హైదరి, ఇంకొక హీరోయిన్ ఉన్నా కూడా తన ప్రత్యేకతని చాటుకుంది. అంతరిక్షం సినిమాలో లావణ్య చేయడానికి ఏమి లేదు, ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసింది. డ్యూయల్ రోల్ ప్లే చేసిన సత్యదేవ్, రెహ్మాన్, శ్రీనివాస్ అవసరాల, రాజా తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేసి, సినిమాని ముందుకి నడిపించడం హెల్ప్ అయ్యారు. ప్రతి పాత్రకి ఇంపోర్టాన్స్ ఉన్న అంతరిక్షం సినిమాకి కథే హీరో.

antariksham movie review

టెక్నీకల్ మూవీ…

ఘాజి సినిమాతో మెప్పించిన సంకల్ప్, మరోసారి ఒక కొత్త ప్రయోగం చేస్తూ అంతరిక్షం చేశాడు. మంచి లైన్ తీసుకున్న సంకల్ప్, ప్రిడిక్టివ్ స్క్రీన్ ప్లే కి వేగం లోపించడంతో ఆడియన్స్ కి కాస్త బోర్ కొట్టించాడు. కథనం కొంచెం  మార్పులు చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఆడియన్స్ కి కొత్తరకమైన ఫీలింగ్ ని కలిగించడంలో సంకల్ప్ పూర్తిగా సక్సస్ అయ్యాడు. అంతరిక్షం సినిమాని తెరకెక్కించడానికి అతను ఎంత స్టడీ చూశాడో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ అక్కడా తేడా కొట్టిన కూడా మొత్తంగా చూస్తే బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. నిజానికి ఈ సినిమా మాస్ ని మిప్పించదేమో, మెట్రోల్లోనే ఆడుతుందేమో అనే అనుమానాలు తలెత్తాయి కానీ దేశపరువుని కాపాడడాన్ని మించిన మాస్ ఏముంటుంది. అంతరిక్షం సినిమా ఎంత టెక్నీకల్ మూవీ అయినా కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండడంతో సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నథింగ్ వెంట్ రాంగ్ విత్ అంతరిక్షం.  ఘాజి సినిమాతో పోల్చకుండా థియేటర్ కి వెళితే అంతరిక్షం సినిమాని ఎంజాయ్ చేసి రావొచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *