రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయని విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయని విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయలేకపోయిన కర్ణాటకకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులపై కేంద్రం కరుణించింది. ఆ విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మే 20న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రైలు ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్ష మిస్ కావడం పట్ల కర్ణాకట మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీని ట్విట్టర్ వేదికగా విమర్శలులు గుప్పించారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయ్యింది.
కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే రైలు ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్ష మిస్ కావడం పట్ల అటు సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయ్యింది. దీంతో దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు పరీక్షను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *