కుంబ్లే అద్భుతానికి 20 ఏళ్లు

కుంబ్లే అద్భుతానికి 20 ఏళ్లు
ప్రపంచమంతా అతన్ని అనిల్‌ కుంబ్లే అని పిలుస్తుంది. ఇష్టమైన వాళ్లు ముద్దుగా జంబో అని పిలుస్తారు. టీం ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు తన బంతి మాట్లాడుతుంది. గిర్రున తిరుగుతూ వెళ్లి ప్రత్యర్ధి వికెట్లను గిరాటేస్తుంది. నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఆటగాళ్లలోకి నిరభ్యంతరంగా కుంబ్లే పేరును చేర్చుకోవచ్చు. పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా దాని నీడ నేల మీదే ఉన్నట్టు… తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మైదానంలోనూ, బయటా ఒదిగి ఉంటాడు. ఈ రోజున ఎంతో మంది యువ క్రికెటర్లు కుంబ్లే నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవచ్చు. జంబో కెరీలోనే అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌కు నేటితో 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దానిపై ఓ లుక్కేద్దాం పదండి.
 
Anil kumble 10 wickets

సరిగ్గా 20 ఏళ్ల క్రితం…

కుంబ్లే సృష్టించిన అద్భుతానికీ, అందించిన అపూర్వ విజయానికీ అప్పుడే 20 ఏళ్లు పూర్తయింది. అది 1999 ఫిబ్రవరి 7…టీం ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య టెస్ట్‌ సమరం నడుస్తోంది.
రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేస్తే పాక్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. బ్యాటింగ్‌ దిగిన పాక్‌ అదరగొడుతూ ఉంది. వంద పరుగులు పూర్తయినా మన బౌలర్లు వికెట్‌ తీయలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలో కుంబ్లే చేతికి కెప్టెన్‌ బంతినిచ్చాడు. వచ్చీరాగానే అఫ్రిదీ(41) రూపంలో తొలి వికెట్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఒక్కోవికెట్‌నూ ఒక్కోవికెట్‌నూ నేలరాల్చి… పాక్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అలా మొత్తం పది వికెట్లనూ తానే తీసుకున్నాడు. 212 పరుగుల భారీ విజయాన్ని భారత్‌కు అందించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లూ తీసిన బౌలర్‌ కుంబ్లే చరిత్ర సృష్టించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *