పారిశ్రామికవేత్త జయరామ్ కేసులో కీలక మలుపు

పారిశ్రామికవేత్త జయరామ్ కేసులో కీలక మలుపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుని తెలంగాణకు బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణలో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఉండటం, తెలంగాణతో ముడిపడి ఉండటంతో ఈ కేసును అక్కడికి బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. జయరామ్ భార్య ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని…ఈ కేసులో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఉండటంతో రాష్ట్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివాదాలకు కారణమైందనే తెలంగాణకు బదిలీ చేసినట్టు సమాచారం తెలుస్తోంది.
 
ఈ కేసులో రాకేశ్ రెడ్డిని నిందితుడిగా తేల్చడం పట్ల జయరామ్ భార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు శిఖా చౌదరెనే కారణమని ఆరోపించారు. ఆమెను తప్పించడానికే ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పారు. ఈ కేసుని తెలంగాణ రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

పెద్దవాళ్లే రంగంలోకి

ఈనెల 1 వ తేదీన నందిగామలో జయరామ్ మృతదేహాన్ని కారులో అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసు విషయంలో ఆయన మేనకోడలు శిఖా చౌదరితో పాటు..ఆమె స్నేహితుడు రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రాకేష్ రెడ్డినే జయరామ్‌ను హత్య చేసినట్లుగా తేల్చారు. అయితే ఇందులో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెను ఈ కేసు నుంచి తప్పించడానికి చాలామంది పెద్ద పెద్దవాళ్లే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *