ఆంధ్రా ఆక్టోపస్ సర్వే ఈసారి కూడా బెడిసికొడుతుందా..?

ఆంధ్రా ఆక్టోపస్ సర్వే ఈసారి కూడా బెడిసికొడుతుందా..?

ఆంధ్రాలో అధికారం టీడీపీదేనా? అమరావతిలో సవారీ చేసేది మళ్లీ సైకిలేనా? ఎగ్జిట్‌ పోల్స్ సర్వేలన్ని వైసీపీదే విజయమని ఢంకా బజాయిస్తున్నా…. లగడపాటి టీం మాత్రం విభిన్న ఫలితాలను ప్రకటించింది. జగన్‌కు మరోసారి నిరాశ తప్పదని.., చంద్రబాబుకే జనం జైకొట్టారని చెబుతోంది. ఆర్జీ ఫ్లాష్‌ టీం చెప్పిన ఆసక్తిర అంశాలేంటో మీరే చూడండి.

తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వే అంచనాలు వచ్చేశాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి… ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వే అంచనా వేసింది. అంటే ఈసారి కూడా టీడీపీకి మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు సర్వే వెల్లడించింది.

అటు లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీ వైపే ప్రజలు మొగ్గు చూపారని లగడపాటి సర్వే అంచనా వేసింది. ఏపీలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని…, వైసీపీకి 40 నుంచి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేనకు 10 నుంచి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా పార్టీలకు ఈ స్థాయిలో ఓట్లు దక్కొచ్చని సర్వేలో తేలింది.

మహిళా ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుచూపారని.. పురుష ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేసినట్టు సర్వే అభిప్రాయపడింది. ఇక యువత ఓట్లు జనసేనకు ఎక్కువగా పడినట్టు సర్వే అభిప్రాయపడింది. జనవరి నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏంటనే ఆర్జీ ప్లాష్ టీం నెలనెలా అంచనా వేసి చెప్తున్న సర్వే ఇదని లగడపాటి స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *