ఒక చెట్టుతో మీ రోగాలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా?

ఒక చెట్టుతో మీ రోగాలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా?

ఒక చెట్టుతో మీ రోగాలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా? క్యాన్సర్‌, బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ నుంచి ఉపశమనం లభిస్తుందా? వ్యంధత్వ నివారణకు దివ్య ఔషధంగా పనిచేస్తుందా? ఇంతకీ ఏమిటా
కల్పవృక్షం..! ఏ దేశాల్లో పండుతుంది?

మునగ చెట్టు మనిషి ఆయువుకు పట్టు..ఔషధ గుణాలకు తొలిమెట్టు..సకల రోగాల పనిపట్టు..ఇలా మునగ గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది..ఒమేగా-3,6,9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు…మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగచెట్టు. ఇన్ని పోషకాలను కురిపించే కల్పవృక్షాన్ని మనం పక్కనపెట్టినా..అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టుపై లోతైన పరిశోధనలు చేసింది. అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో మునగ ప్రాధాన్యతపై భారత్‌ దృష్టి పెట్టింది.

రోజూ కాస్త మునగాకు తింటే వందేళ్లు బతకేయొచ్చట. వంద గ్రాముల తాజా మునగాకుల్లో…నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌ ఉంటుంది. క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌-ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.
పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించింది లేదంటారు ఆయుర్వేద వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. మునగాకులోని బీటాకెరోటిన్‌ అంధత్వాన్ని నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా, భారత్‌లో తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది.
ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. ఇందులోని ఔషధాల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. టీస్పూను పొడిని రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. రోజూ ఓ గుప్పెడు తాజా మునగ ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *