చిరు-కొరటాల సినిమాలో కనిపించనున్న అనసూయ?

చిరు-కొరటాల సినిమాలో కనిపించనున్న అనసూయ?

బుల్లితెర మీద హాట్ యాంకర్ గా పేరున్న అనసూయ,తన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ వెండితెరపైన కూడా బాగానే మెరుస్తోంది.ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కథనంలో నటిస్తున్న అనసూయ త్వరలో స్టార్ కాబోతున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.మరి అనసూయ పట్టిన ఆ లక్కీ ఆఫర్ ఏంటో చూడండి

యాంకర్ అనసూయ… తన అందం,అభినయంతో బుల్లితెర మీదే కాదు..వెండితెర మీద కూడా సత్తా చాటుతుంది.స్పెషల్ సాంగ్స్,విలన్ క్యారెక్టర్స్ ,క్యామియోస్,ఫీమేల్ లీడ్…ఇలా తనకొచ్చిన ప్రతి పాత్రకి న్యాయం చేస్తూ అనసూయలో అందమే కాదు అంతకు మించిన అద్భుతమైన నటి కూడా ఉందని కంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ…స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోసేస్తూనే,తన నటనతో అందరినీ ఫిదా చేసింది.ప్రస్తుతం బుల్లితెర,వెండితెర మీద బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అయిన అనసూయ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అనసూయకు వచ్చిన ఆ లక్కీ ఆఫర్ చిరు-కొరటాలడి కావడం విశేషం.కొరటాల సినిమాలో చిరంజీవి పక్కన ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు కానీ ఆ సినిమాలో నటీనటులు ఎంపిక మాత్రం దాదాపుగా జరిగిపోయింది.ఇప్పటికే కమెడియన్ గా సునీల్ ను చిరుకి సైడ్ క్యారెక్టర్ లో ఎంపిక చేసిన కొరటాల,ఇప్పుడు అనసూయని మరో కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.కథలో కీలకమైన పాత్రలో అనసూయ కనిపిస్తుందని..అంతేకాకుండా ఇప్పటికే చిత్రబృందం అనసూయ కాల్షీట్లు కూడా తీసేసుకుందని తెలుస్తోంది.ఇదే నిజమైతే అనసూయ కెరీర్ కి మంచి బ్రేక్ దొరికినట్లే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *