నిర్మాతగా రంగమ్మత్త !

నిర్మాతగా రంగమ్మత్త !

జ‌బ‌ర్‌ద‌స్త్ యాంక‌ర్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అన‌సూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ మంచి పాత్ర‌ల‌ను సెలక్ట్ చేసుకుంటూ కెరీర్‌ని ముందుకు నడిపిస్తోంది. స్పెషల్ సాంగ్స్, విలన్ క్యారెక్టర్స్ , క్యామియోస్, ఫీమేల్ లీడ్… ఇలా తనకొచ్చిన ప్రతి పాత్రకి న్యాయం చేస్తోంది.ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ… స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోసేస్తూనే, తన నటనతో అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర మీద బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అయిన అనసూయ తీసుకున్న ఓ నిర్ణయానికి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

anasuya latest pics

తన ప్రెండ్స్ తో కలిసి త్వరలోనే ఓ సినిమాని నిర్మించబోతుందట. త‌క్కువ బ‌డ్జెట్‌లో కంటెంట్ బేస్డ్ మూవీస్ చేయాల‌నేది అన‌సూయ భావిస్తుందట. మ‌రి ఇప్ప‌టికే అన‌సూయ ఆ దిశ‌గా అడుగులు వేస్తుందట. ఇటీవలే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు కనెక్ట్ అయిన అనసూయ త్వరలో ఆ సినిమాలో నటించే హీరో, హీరోయిన్ గురించి అఫిషియల్‌గా అనౌన్స్ చేయబోతుందని సమాచారం.ఇప్ప‌టి వ‌ర‌కు హాట్ యాంక‌ర్‌గా, మంచి న‌టిగా పేరు సంపాదించుకున్న అన‌సూయ నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధిస్తుందో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *