నేడు హైద‌రాబాద్‌కు రానున్న అమిత్‌షా

నేడు హైద‌రాబాద్‌కు రానున్న అమిత్‌షా

ఈ రోజు తెలంగాణాకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రానున్నారు. దీంతో తెలంగాణా రాజకీయాలు ఆశక్తిని రేపుతున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌ షా తెలంగాణాలో ప్రారంభించటం… స్వయంగా ఆయనే ఈ కార్యక్రమానికి రావటంతో ఇక్కడ బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ అని చర్చ జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ దూకుడును ప్రదర్శింస్తుంది. దేశ వ్యాస్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడదామని… తానే స్వయంగా వస్తానని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఆ సమయం రావటంతో పార్టీ నేతలు కార్యాక్రమానికి సిద్ధమవుతున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో అమిత్‌షా రాకపై వాడా వేడి చర్చ జరుగుతోంది.

ఇటీవల తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలను ఢిల్లీ పిలుపుచుకొన్న అమిత్ షా దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఉన్న అవకాశాలను వివరించారు. పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో ప్రజలకు పార్టీపై విశ్వాసం పెరగటానికి నిదర్శనమని చెప్పారు. దీనిని మరింత పెంచేందుకే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి కూడా ఇచ్చామని చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సరైన సమయమని.. ప్రజలు అనుకూలంగా ఉన్నప్పడు పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

అమిత్ షా స్వయంగా తానే వస్తానని ప్రకటించటంతో పార్టీ నేతల్లో ఉత్సహం పెరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అమిత్ షా ఏం మాట్లాడుతారనే దానిపై పార్టీ నేతలే కాకుండా విపక్షాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గతంలో నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా అమిత్ షా చేసిన ప్రసంగం రాజకీయంగా పెద్ద దుమారం లేపాయి. దీనితో మరోసారి అమిత్ షా పర్యటన చర్చనీయాంశంగా మారింది. పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారిని వస్తున్న నేపధ్యంలో ఆయన సమక్షంలో ఎవరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అని పొలిటికల్ సర్కిల్‌లో హీట్ ఎక్కిస్తుంది.

ఏదిఏమైనా… తాజా పరిస్థితలను చూస్తే.. తెలంగాణపై.. పార్టీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే.. భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుంది, కాషాయం కండువా ఎవరు కప్పుకుంటారనే దానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *