థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ రివ్యూ

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ రివ్యూ

ఫస్ట్ టైం బాలీవుడ్ టాప్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటించిన మూవీ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 1800ల కాలంలో భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న బ్రిటీష్‌ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆజాద్‌, ఫిరంగీలు ఎలా ఎదుర్కొన్నారు.. అన్న కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

thugs of hindusthan review

కథ పరంగా….

ఈ మూవీ కథ విషయానికి వస్తే రెండు శతాబ్దాల క్రితం బ్రిటిష్‌ పాలన కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని ముఠాలు దారి దోపిడీలతో గడగడలాడించాయి. థగ్స్‌ పేరుతో పిలువబడే వీళ్ళు బ్రిటిష్‌ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం వారిపై దృష్టిపెట్టింది. థగ్గులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించింది. వారు థగ్గులను అణచివేయడానికి కర్కశంగా వ్యవహరించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యానికి కల్పిత సంఘటనలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ సినిమా విజువల్ వండర్ అనే చెప్పోచ్చు.

thugs of hindusthan review

పాత్రల విశ్లేషణ…

థగ్గుల బృందానికి కమాండర్‌గా ఖుదాబక్ష్ ఆజాద్‌ పాత్రలో అమితాబ్‌, ఫిరంగి అనే జిత్తులమారి థగ్గుగా ఆమీర్‌, విలువిద్యలో ఆరితేరిన జఫీరా అనే థగ్గుగా ఫాతిమా సనా షేక్‌ నటించారు.సురైయ్యా అనే అందమైన నర్తకిగా కత్రినా కైఫ్‌ నటించింది.అయితే సినిమా అంతా అమితాబ్‌, ఆమిర్‌ల పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఇద్దరు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా ఆమిర్‌ ఖాన్‌ మరోసారి తనదైన నటనతో మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. రిస్కీ స్టంట్స్‌లోనూ అంతే పర్ఫెక్షన్‌ చూపించాడు. ఇక అమితాబ్‌ బరువైన కాస్ట్యూమ్స్‌ ధరించి ఆయన చేసిన యాక్షన్‌ సీన్స్‌ అభిమానులను అలరిస్తాయి.. కత్రినా కైఫ్‌ కేవలం రెండు పాటలకే పరిమితం అయినా గ్లామర్‌ షోతో ఆకట్టుకుంది.

ఓవరాల్ గా…

1839లో వచ్చిన కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ది థగ్‌’అనే నవల ఆధారంగా విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..ఫస్టాప్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్ ఆడియన్స్ ఆకట్టుకున్నాయి. ఇక సెకండాప్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల వచ్చే సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. సంగీతం, నేపథ్య సంగీతం, సీజీఐ వర్క్‌, సెట్స్‌ ఆకట్టుకుంటాయి. యశ్‌రాజ్‌ ఫిలింస్‌కు తగ్గట్టు నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. భారీ అంచనాల తో వచ్చిన ఈ సినిమాని చూసి అందరు ఎంజాయ్ చేయోచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *