సుమలత పొలిటికల్ ఎంట్రీ ?

సుమలత పొలిటికల్ ఎంట్రీ ?

సుమలత… హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ముందు తరం సినిమా ప్రేక్షకులు మర్చిపోవాలన్నా మర్చిపోలేని పేరు. సౌత్‌ ఇండియాలో అగ్ర కథానాయికగా అలరించింది. బుల్లి తెర మీదా తనని తాను నిరూపించుకుంది. ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ను పెళ్లాడింది. కాలం వేగంగా మారిపోయింది కానీ, అభిమానుల హృదయాల్లోంచి సుమలతను మాత్రం చెరపలేకపోయింది. ఇటీవలే ఆమె భర్త అంబరీష్ మరణించిన సంఘటన అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు సుమలత పొలిటికల్‌ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది.

Sumalatha

ప్రతికూల వాతావరణం…

సుమలత పొలిటికల్‌ ఎంట్రీ దాదాపు ఖాయమన్నట్టే కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచీ ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. ఆదివారం మండ్యలో జరిగిన అంబరీష్ సంస్కరణ సభలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ సభలో పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సభలో పాల్గొన్నవారిలో కొందరు సుమలత రాజకీయ ప్రవేశాన్ని చర్చకు తెచ్చారు. దీనిపై అంబరీష్, సుమలతల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సుమలత ఏ పార్టీ నుంచీ పోటీచేసినా, ఇంటిపెండెంట్‌గా పోటీచేసినా తనని గెలిపించుకుని తీరుతామని నినాదాలు చేశారు. సుమలత కుమారుడు హీరో అభిషేక్‌ కూడా ఈ విషయంపై పాజిటివ్‌గా ఉన్నాడు. ఈ ప్రతిపాదనపై సుమలత ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఏ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్నదే అంతుచిక్కడం లేదు. సుమలతను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఎవరి పావులను వారి కదుపుతున్నారే వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *