అమెజాన్ బంపర్ సమ్మర్ సెల్..తక్కువ ధరకే 32 అంగుళాల టీవీ!

అమెజాన్ బంపర్ సమ్మర్ సెల్..తక్కువ ధరకే 32 అంగుళాల టీవీ!

సమ్మర్ వచ్చేసింది. స్కూల్ పిల్లలకు సెలవులు. ఎండ వేడిని తప్పించుకోవడానికి చాలామంది ప్రయాణాలు కట్టే ఋతువు. ఎవరైనా సరే కొంచెం ఎక్కువ విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఇదే..! దీన్ని క్యాష్ చేసుకోవాలని రకరకాల కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తాయి. గతంలోనైతే టీవీల్లో, పేపర్లలో కంపెనీల యాడ్స్ వచ్చేవి. అయితే, ఇపుడందరూ ఆన్‌లైన్ షాపింగ్‌కే ఎక్కువ మోజు చూపిస్తున్నారు కాబట్టి కంపెనీల కంటే ముందు ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రకటించిన సమ్మర్‌సేల్ ఇపుడందరినీ ఊరించేస్తోంది.

సమ్మర్ సేల్ ఆఫర్‌లో కొత్త ఎలీడీ టీవీని చాలా తక్కువ ధరకే అమ్ముతోంది అమెజాన్. టీవీ కొనాలనుకునే వారికి ఇది అద్దిరిపోయే ఆఫర్. చౌక ధరకే 32 అంగుళాల టీవీని సొంతం చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది అమెజాన్. ఈ సేల్ మే 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ దిగ్గజం బీపీఎల్ కంపెనీ తను ఉత్పత్తి చేసే టీవీల్లో 32 అంగుళాల ఎల్ఈడీ హెచ్‌డీ రెడీ టీవీని కేవలం రూ.8,999కే తీసుకువచ్చింది. టీవీ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి ప్రయోజనాలు కూడా ఉండటం విశేషం. .

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులు ఉంటే గనక 10 శాతం తక్షణమే తగ్గింపు పొందొచ్చు. రూ.8,999 పెట్టి టీవీ కొంటే మీకు రూ.899 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీకు టీవీ రూ.8,100లకే వచ్చినట్లు అవుతుంది. ఈ ఆఫర్ కాకుండా ఎక్స్చేంజ్ రూపంలో మరో అవకాశాన్ని ఇచ్చింది. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.3,540 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు, ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, కొన్ని డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *