అమెజాన్ సీఈఓ సంచలన నిర్ణయం.. సంస్థపై ప్రభావం పడుతుందా !?

అమెజాన్ సీఈఓ సంచలన నిర్ణయం.. సంస్థపై ప్రభావం పడుతుందా !?

అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆమె ఒక నవలా రచయిత. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. ఆమె..అతని జీవితంలోకి వచ్చాకే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాడు అది విజయవంతం కూడా అయింది. అతనికి తోడుగా ఆమె కూడా వ్యాపారంలో సాయంగా ఉండి అతని ఎదుగుదలకు ఎంతో తోడ్పాటుని అందించింది.

పాతికేళ్ల అన్యొన్యం!

వారిద్దరే…అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్…మెకంజీ బెజోస్. వీరిద్దరి వివాహం 1994లో జరిగింది. అదే సంవత్సరం జెఫ్ బెజోస్ అమెజాన్ అనే ఈ కామర్స్ కంపెనీని ప్రారంభించాడు. అమెజాన్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే…గత వారమే ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సాధించింది. ఇపుడు కొత్తగా జెఫ్ బెజోస్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆమె కూడా దీన్ని నిర్ధారించింది. విడిపోయినా కూడా వీరిద్దరూ తమ తమ జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులలో కలిసి పనిచేస్తారు.

Jeff Bezos

తను లేకపోతే ఏమైపోయేవాడినో…

25 ఏళ్ల క్రితం వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జెఫ్ బెజోస్ మాట్లాడుతూ…” అమెజాన్‌ను స్థాపించడంలో మెకంజీ నాకు అందించిన ప్రోత్సాహం వెలకట్టలేనిదనీ, తనకెంతో సహాయపడింది. మనల్ని ప్రేమించే మన ప్రయత్నాలలో తోడుగా ఉండే కుటుంబ సభ్యులు ఉండటం ఎంతో అదృష్టం..తనకూ అలాంటి అదృష్టమే దక్కింది “అని చెప్పాడు. వీరి పెళ్లైన కొత్తలో మెకంజీ అమెజాన్‌లో అకౌంటింగ్ బాధ్యతలను నిర్వహించేవారు. బెజోస్ జంట సామాజిక బాధ్యత విషయంలోను ముందుంటారు. వివిధ కార్యక్రమాలకు చాలా మొత్తంలోనే విరాళాలను ఇచ్చారు.

కొత్త ఐడియాలు..

అమెజాన్ ప్రారంభించినపుడు మొదత ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయం చేసేవారు. చాలా తక్కువ సమయంలోనే అంచనాలను మించి ఎదిగింది. వాల్‌మార్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను సవాలు విసిరే స్థాయికి చేరింది. కిండిల్ ఈ-రీడర్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటుచేసింది. జెఫ్ బెజోస్, మెకంజీ దంపతుల విడాకుల ప్రకటనతో అమెజాన్ వాటాదారులు, పెట్టుబడి దారులు షాక్ అయ్యారు. ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఎదిగిన అమెజాన్ ఈ పరిణామంతో సంస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అని వారు ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *