అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్ వెనక్కు తగ్గిన మైక్రోసాఫ్ట్!

అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్ వెనక్కు తగ్గిన మైక్రోసాఫ్ట్!

ఇన్నేళ్లుగా అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ వెలిగింది. ఇపుడు ఆ స్థానాన్ని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అగ్రస్థానానికి వెళ్లింది. అమెజాన్ మార్కెట్ విలువ 797 బిలియన్ డాలర్లకు పెరిగింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువ 789 బిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అమెజాన్ లిస్టెడ్ కంపెనీల్లో మొదటిస్థానానికి రావడం ఇదే మొదటిసారి. 

jeff bezos amazon

మైక్రోసాఫ్ట్ 2 శాతమే…

సోమవారం నాడు అమెజాన్ షేర్లు 3 శాతం పెరిగాయి. దీంతో మార్కెట్ విలువ 797 బిలియన్ డాలర్లకు వెళ్లింది. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా పెరిగాయి కానీ 2 శాతం మాత్రమే లాభపడింది. కంపెనీ మార్కెట్ విలువ 789 బిలియన్ డాలర్లకు నమోదయింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ను దాటి అమెజాన్ అగ్రస్థానానికి చేరుకుంది. 

గత ఆగస్ట్‌లో యాపిల్ సంస్థ మొదటి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. తర్వాత అమెజాన్ ట్రిలియన్ డాలర్ల లిస్ట్‌లో చేరింది. తర్వాత జరిగిన పరిణామాలతో యాపిల్, అమెజాన్ కంపెనీ మార్కెట్ విలువను కోల్పోవల్సి వచ్చింది. నవంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఈ రెండు కంపెనీలను దాటి మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా, అమెజాన్…మైక్రోసాఫ్ట్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *