విజయ్ సేతుపతి సినిమా నుండి అమలా పాల్ అవుట్

విజయ్ సేతుపతి సినిమా నుండి అమలా పాల్ అవుట్

ఆడై సినిమా టీజ‌ర్‌తో ఇండియా వైజ్‌గా ఒక్క‌సారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది హీరోయిన్ అమ‌లాపాల్‌. ఆ సినిమాలో న‌గ్నంగా న‌టించిన అమ‌ల సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చేసింది. ఈ సినిమా త‌మిళంతోపాటు సౌత్‌లో అన్ని భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే విజ‌య్ సేతుప‌తి చిత్రంలో న‌టించేందుకు అమ‌ల అంగీక‌రించింది. ఈ సినిమా కాల్షిట్స్‌కు సంబంధించిన ఆగ్రిమెంట్ కూడా పెట్టుకుందట. ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఆ సినిమా నుంచి అమ‌ల త‌ప్పుకున్న‌ట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఆడై టీజ‌ర్‌కు వ‌చ్చిన రెస్సాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ కావాల‌నిడిమాండ్ చేసింద‌ట‌. అంతే కాకుండా కొన్ని కొత్త ష‌రతులు కూడా విధించింద‌ట. దీంతో అమ‌ల‌ను ఆ సినిమా నుంచి త‌ప్పించినట్టు స‌మాచారం అమ‌ల స్థానంలో యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌ను తీసుకున్నారట. విజ‌యాలు లేక డీలా ప‌డుతున్న‌ మేఘ‌కు ఇది బంప‌రాఫ‌ర్ అనే చెప్పాలి.అయితే కెరీర్ కరెక్ట్ ముందుకు సాగుతున్న టైంలో అమల పాల్ ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు కోలీవుడ్ సినీ వర్గాలు.. ఈ విషయంపై అమల పాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *