అద్భుతమైన రెస్పాన్స్ తో 'ఆమె' ట్రైలర్.. !

అద్భుతమైన రెస్పాన్స్ తో 'ఆమె' ట్రైలర్.. !

కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ మూవీ ఆమె పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ఈ మూవీ టీజ‌ర్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్.

ఆడై సినిమా టీజ‌ర్‌తో ఇండియా వైజ్‌గా ఒక్క‌సారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది అమ‌లాపాల్‌. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్‌కు అదిరిపోయే రెస్సాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అమ‌లాపాల్‌ని భిన్న షేడ్స్‌లో చూపించారు. ప్ర‌తి షేడ్‌లోను అమ‌లాపాల్ న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంది.ఆమె ఆలోచనలే.. ఆమెని సమస్యల్లోకి నెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. తెలుగులో ఈ మూవీ ఆమె పేరుతో రిలీజ్ కానుంది. హై ఎక్స్ పెటేషన్స్‌తో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ అమలాపాల్‌కు సక్సెస్‌ని ఇస్తుందో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *