తమన్ అంటున్న త్రివిక్రమ్.. వద్దు DSP కావాలి అంటున్న బన్నీ!

తమన్ అంటున్న త్రివిక్రమ్.. వద్దు DSP కావాలి అంటున్న బన్నీ!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, స‌న్నాఫ్ సత్య‌మూర్తి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.ఈ సినిమాల్లో పాటలతో పాటు, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఇచ్చాడు దేవి. అయితే స‌న్నాఫ్ సత్య‌మూర్తి టైంలో త్రివిక్రమ్, దేవి శ్రీ ప్రసాద్ కు మనస్పర్ధలు వచ్చాయట.అందుకే అ ఆ నుంచి నుంచే దేవిని పక్కన పెట్టాడట త్రివిక్రమ్. ఇప్పుడు బన్నీ , త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ని కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ని తీసుకోవాలిని చూస్తున్నాడట. త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వచ్చిన అర‌వింద‌స‌మేత సినిమా త‌మ‌న్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా హిట్‌కు త‌మ‌న్ మ్యూజిక్ కూడా కీ రోల్ పోషించింది. అందుకే త‌మ‌న్‌నే బ‌న్ని సినిమాకు తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

బ‌న్ని, త్రివిక్ర‌మ్‌కు ఈ చిత్రం హ్యాట్రిక్ మూవీ అవతుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తే .. బ‌న్నికి, త‌మ‌న్‌కి కూడా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇంత‌కు ముందు బ‌న్ని న‌టించిన రేసుగుర్రం, స‌రైనోడు చిత్రాల‌కు త‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో కూడా మ్యూజిక్ ప‌రంగా మెప్పించి బ‌న్నితో హ్యాట్రిక్ కొట్టాల‌నుకుంటున్నాడ‌ట త‌మ‌న్‌. మరి ఈ ఇద్దరి నమ్మకాన్ని తమన్ ఎంతవరకు నిలబెడుతాడో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *