సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న బన్నీ- త్రివిక్రమ్

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న బన్నీ- త్రివిక్రమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేద్దాం అనుకన్నారు. కానీ షూటింగ్ కాస్త లేట్‌గా స్టార్ట్ కావడం. దసరాకు చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి రిలీజయ్యేలా ఉండటంతో బన్నీ సినిమా రిలీజ్ డేట్ మార్చుకున్నారట.2020 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఇదే సిజన్‌కు మహేష్ బాబు,అనిల్ రావిపూడి మూవీతో పాటు బాలయ్య,కె.ఎస్.రవికుమార్ మూవీ, సాయిధరమ్ తేజ్,మారుతి సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే బన్నీ సినిమా ఖరారైతే తేజు చిత్రాన్ని రేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. మరి ఈ సినిమాతో అయినా బన్నీ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *