ఓటు వేసిన అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ !

ఓటు వేసిన అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ !

తెలంగాణలో పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో అయితే ప్రముఖులు ఉదయమే ఓటు వేసేందుకు వచ్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ భార్య, తల్లితో కలిసి ఓటు వేశారు. అల్లు అర్జున్ కూడా ఓటు వేశారు.

దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే..ప్రజలతీర్పు అవసరముంది అన్నారు సినీ స్టార్లు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విధిగా ఓటు వేసి తమ బాధ్యత నెరవేర్చాలని కోరారు అల్లు అర్జున్. ఓటు వేసినప్పుడే ప్రశ్నించే హక్కు కూడా ఉంటుందని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడు కూడా విధిగా ఓటు వేసి.. తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఈ ఇద్దరు నటులూ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *