అల్లు అరవింద్ నిర్మాతగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో 3డీ రామాయణం

అల్లు అరవింద్ నిర్మాతగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో 3డీ రామాయణం

బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా వరల్డ్ వైజ్‌గా తెలిసిపోయింది. బాహుబలికి ముందుకు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్‌తో సినిమాలను నిర్మించేవారు టాలీవుడ్ నిర్మాతలు. కానీ బాహుబలితో సమీకరణాలు మారిపోయ్యాయి. మన హీరోల క్రేజ్‌ని, కథలని దృష్టిలో పెట్టుకొని 300 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీ దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్‌తో కలిసి పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ RRR మూవీ 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో కూడా ఇంత పెద్ద బడ్జెట్‌తో ఏ సినిమా రాలేదు. RRR మూవీ బడ్జెట్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు RRR మూవీని మించేలా హాలీవుడ్ రేంజ్‌లో హై టెక్నికల్ వ్యాల్స్‌తో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగుతో పాటు తమిళ్, హిందీలో రామాయణం సినిమా తెరకెక్కబోతోంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి సంయుక్తంగా నిర్మింబోతున్నారు.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫిషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకునేలా సినిమా మొత్తం 3డీ కెమెరాలతోనే షూట్ చేయబోతున్నారట.. మూడు పార్టులుగా తెరకెక్కనున్నఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటి నటుటు నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాని దంగల్ ఫేం నితేశ్ తివారీ, మామ్ ఫేం రవి ఉద్యవార్ డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. 2021లో ఫస్ట్ పార్ట్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలోనే అతి పెద్ద మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ రామాయణం కావడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *