ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆరో దశ పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ప్రచారం పర్వానికి తెరపడటంతో…పోలింగ్‌ ఏర్పాట్లను ఈసీ ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఈదశలో పోలింగ్‌ జరగనుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన అన్నిదశల్లో కంటే.. ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ రాజకీయవర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది.ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఇందులో అధికభాగం బీజేపీ సిట్టింగ్‌ స్థానాలే కావడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు కేంద్ర మంత్రి మేనకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ వంటి ప్రముఖులు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఆసక్తి రేపుతోంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడింటికి ఏడింటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేయాలని భావిస్తోంది. కానీ ఈసారి అదంత సులువైన విషయం కాదు. అక్కడ ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోంటోంది. ఇక 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రం యూపీ. ఆరో దశలో ఇక్కడ 12 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఇవన్ని కూడా బీజేపీ స్థానాలే. అయితే ఆయా స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి నుంచి బీజేపీ పోటీని ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్‌ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా ఆ పార్టీ యువనేత ప్రియాంకగాంధీ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.

మరోవైపు బీహార్‌లోని 18 స్థానాలకు ఆరో దశలో పోలింగ్‌ జరుగనుంది. వీటిలో 7 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నారు. గత ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని బీజేపీ- జేడీయూ కూటమి భావిస్తోంటే.., కాంగ్రెస్- ఆర్జేడి కూటమి విజయంపై ధీమాతో ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ప్రస్తుతం అక్కడ సీన్‌ రివర్స్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టంకట్టారు. ఇలానే మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరి ఏం జరగుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *