జాన్వీని రీప్లేస్ చేసిన అలియా భట్

జాన్వీని రీప్లేస్ చేసిన అలియా భట్

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరోయిన్స్ ఎవరు అనే చర్చ ఫాన్స్ లో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా చర్చలే జరిగాయి.అన్ని రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ ట్రిపుల్ ఆర్ ఫుల్ డీటైల్స్ చెప్పేసిన జక్కన్న,చరణ్ కి జోడిగా సీతా క్యారెక్టర్ లో ఆలియా భట్,తారక్ కి జోడీగా డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారని చెప్పేశాడు.అయితే ముందుగా ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర లో జాన్వీ కపూర్ ఫైనల్ అయిందని చాలా వార్తలు వచ్చాయి.సడన్ గా రాజమౌళి,జాన్వీని కాదని అలియా భట్ ని ఫైనల్ చేసి అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారుAlia bhatt role in rrr movie

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జాన్వీ ప్లేస్ లోకి ఆలియా భట్ రావడానికి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కారణమని తెలుస్తోంది.ఆలియాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్ కి,ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం.. అందం,అభినయం రెండూ అలియాలో ఉన్నాయి కాబట్టే గత కొంత కాలంగా కరణ్ జోహార్ తీస్తున్న 90% మూవీస్ లో అలియాని హీరోయిన్ గా తీసుకున్నాడు.ప్రస్తుతం కరణ్ ప్రెస్టీజియస్ గా ప్రొడ్యూస్ చేస్తున్న భారీ బడ్జట్ మూవీస్ అయిన కళంక్,బ్రహ్మాస్త్రలో కూడా అలియానే హీరోయిన్ గా నటిస్తోంది.అలియాపై టాలెంట్ పై అంత నమ్మకం కాబట్టే కరణ్ జోహార్, రాజమౌళి ట్రిపుల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని చెప్పగానే ఆలియాని రెకమెండ్ చేశాడు. ఇప్పటి వరకూ బాహుబలి విషయంలో, ఇకపై ట్రిపుల్ ఆర్ విషయంలో కరణ్ జోహార్ అండగా నిలుస్తాడు పైగా అలియా మోస్ట్ టాలెంటడ్ యంగ్ యాక్ట్రెస్ ల్లో ఒకరు కాబట్టి జక్కన్న కూడా ఓకే అనేశాడు.దీంతో అప్పటి వరకూ వినిపించిన జాన్వీ ప్లేస్ లో ఆలియా వచ్చి చేరింది.ఇక బాలీవుడ్ లో ఒక మూవీ చేయడానికి 9 కోట్లు తీసుకునే ఆలియా భట్ కి,ఆర్ ఆర్ ఆర్ లో యాక్ట్ చేయడానికి 12 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *