పౌరాణిక పాత్రలో స‌మంత అక్కినేని...

పౌరాణిక పాత్రలో స‌మంత అక్కినేని...

పెళ్లి తరువాత కెరీర్ పరంగా క్రేజ్ మరి పిక్స్  స్టేజ్‌కు వెళ్ళింది. బ్యాక్ టూ బ్యాక్  హిట్స్‌ అందుకుంటుంది సామ్..కానీ రిసెంట్‌గా వచ్చిన యూ టర్న్‌ మూవీలో జ‌ర్నలిస్ట్‌గా క‌నిపించి మెప్పించినప్పటికి  యావరేజ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం   త‌న భ‌ర్తతో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో మ‌జిలి అనే సినిమా చేస్తుంది.ఇందులో కూడా సామ్  క్యారెక్టరైజెషన్ కొత్తగా ఉంటుంద‌ట‌.  ఇప్పుడు ఈ మూవీ సెట్స్ పైన ఉండగానే ఓ ప్రయోగత్మక  సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది..అయితే  ఇప్పటి వ‌ర‌కు సోష‌ల్ సినిమాల‌తో మెప్పించిన స‌మంత త్వర‌లో ఓ పౌరాణిక పాత్రలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అది కూడా నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటించోతుందని తెలుస్తోంది.

రెమ్యూనరెషన్…

యానిమేషన్‌ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న  దర్శకుడు భార్గవ్‌.. రామాయణం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో శూర్పణఖ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్‌ రోల్‌లో నటించనుందట.. ముందుగా  ఈ క్యారెక్టర్‌కు కాజల్‌ను తీసుకోవాలని భావించాడు దర్శకుడు. కానీ  కాజల్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం, రెమ్యూనరెషన్ విషయంలో కూడా కాస్త బెట్టు చేయడంతో  ఈ పాత్రకు సమంత అయితే కారెక్ట్ గా న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు ఇటీవలే సమంతని కలిసి స్టోరీ లైన్ వినిపించడట.

ఓకే చెప్పిందట…

దర్శకుడు భార్గవ్ చెప్పిక కథ,  క్యారెక్టరైజైషన్ సమంతకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పిందట సమంత . కథల విషయంలో కరెక్ట్ డెషిషన్ తీసుకుంటున్న ఈ అక్కినేని కొడలు శూర్పణఖ  తనకు మంచి పేరు తీసుకోస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్ట్‌క్ ఓకే చేసిందని తెలుస్తోంది.   త్వరలోనే  మిగత క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియజేస్తారట  దర్శకుడు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్‌లో  సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం…..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *