గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాలుగో సినిమా చేయనున్న అక్కినేని వారసుడు

గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాలుగో సినిమా చేయనున్న అక్కినేని వారసుడు

హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్, సొంత బ్యానర్ ని వదిలేసి గీత ఆర్ట్స్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించేలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని, మే నెలాఖరున సినిమా ప్రారంభిచడానికి ముహూర్తం నిర్ణయించారని, జూన్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇక సెట్స్ వెళ్లడమే లేట్ అనుకుంటున్న సమయంలో అఖిల్ మూవీకి చాలా పెద్ద కష్టం వచ్చిపడింది.

Akkineni akhil hat trick in flop movies

హిట్ లేకపోవడంతో అఖిల్ కి మార్కెట్ లేదు, ఇప్పటి వరకూ చేసిన సినిమాలు నష్టాలనే మిగిలించాయి కాబట్టి కథకి తగ్గట్లు ఈ సినిమాకు 20 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడట… బడ్జట్ అంతకన్నా పెరిగితే సినిమాకి నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టే అరవింద్ ఈ నిర్ణయానికి తెలుస్తోంది. అయితే 20కోట్ల బడ్జెట్ తో సినిమాకు రిచ్ ఫీల్ రాదనే ఉద్దేశంతో కొడుకు కోసం రంగంలోకి దిగిన నాగార్జున, అదనంగా ఎంత బడ్జెట్ అవుతుందో అదంతా తాను ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *