యూత్‌ని ఆకట్టుకుంటున్న మిస్టర్ మజ్ను పాటలు

యూత్‌ని ఆకట్టుకుంటున్న మిస్టర్ మజ్ను పాటలు

అక్కినేని కుర్ర హీరో అఖిల్ చేసిన రెండు సినిమాలు కూడా  ఆశించిన స్థాయిలో  ఆకట్టుకోలేకపోనాయి.. దీంతో తన మూడో సినిమా మిస్టర్ మజ్ను పైనే ఫుల్‌ఫోకస్ పెట్టాడు . లవ్ అండ్ ఫ్యామీలి ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని డెబ్యూ మూవీ తొలిప్రేమ తో మంచి విజయాన్నందుకున్న వెంకీ అట్లూరి  డైరెక్ట్ చేస్తున్నాడు.   ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావోచ్చింది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో  ఈ మూవీ తనకు  మంచి బ్రేక్ ఇస్తోందని చాలా కన్ఫిడెంట్‌గా ఉన్నాడు అఖిల్.ఇందులో అఖిల్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఏమైనదో.. ఏమైనదో

యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి జ్యూక్‌ బాక్స్‌ను  రిలీజ్ చేశారు చిత్రటీమ్.అన్ని సాంగ్ బాగున్నప్పటికి ముఖ్యంగా  ఏమైనదో.. ఏమైనదో ,మిస్టర్‌ మజ్నుటైటిల్‌ సాంగ్‌, హార్ట్‌ బ్రేక్‌ పాటలను యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్ రిపీటెడ్‌గా వింటున్నారు.

సక్సెస్ ట్రాక్‌

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌‌పీ  పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈసినిమాని త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని జనవరి 25న  రిలీజ్  చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.వరసగా రెండు ప్లాప్ అందుకున్న అఖిల్  మిస్టర్ మజ్ను సినిమాతో అయిన సక్సెస్ ట్రాక్‌ ఎక్కుతాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *