ఐశ్వర్య రాయ్ టర్న్స్ విలన్

ఐశ్వర్య రాయ్ టర్న్స్ విలన్

పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఓ హిస్టారికల్ మూవీని రూపొందించేందుకు దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచసుందరి, బిగ్ బి కోడలు ఐశ్వర్యరాయ్ విలన్‌ పాత్రలో నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా ఈ బ్యూటికి అవకాశాలు కూడా తగ్గడంతో పాటు ఈ సినిమాకు విలన్ పాత్రే కీలకం కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చేప్పిందట..రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఐశ్‌ కనిపించనున్నారట. అయితే తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచిందని తెలుస్తోంది…ఇక ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *