కోలీవుడ్ వర్గాలను భయపెడుతున్న నయనతార

కోలీవుడ్ వర్గాలను భయపెడుతున్న నయనతార

సౌత్‌లో ఫుల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లేడి సూపర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌స్తుతం లేడి ఓరియేంటెడ్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఏడాది రెండు మూడు అయిన చేస్తుంది..ఆ చిత్రాల‌న్నింటిని తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేస్తుంది.ప్ర‌స్తుతం సైరా సినిమాతోపాటు కోలీవుడ్‌లోనూ మూడు సినిమాలతో బిజీగా ఉంది నయన్.ఇటీవలే అంజలి సీబీఐ ఆఫీసర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్‌గా నిలిస్తే, తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇప్పుడు ఐరా సినిమాలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సీనియన్ బ్యూటీకి 63వ చిత్రంగా కావడం విశేషం.తాజా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

దెయ్యాలున్నాయని నమ్మించేందుకు నయనతార చేసిన ప్రయత్నం ఆమెను ఎలా ఇబ్బందుల్లో పడేసిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది.ఇందులో నయనతార డబుల్ రోల్‌లో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.తాజాగా రిలీజైన ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ని క‌లిగిస్తుంది..ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నయనతార ఖచ్చితంగా మరో హిట్‌ని తన ఖాతలో వెసుకుంటుందనిపిస్తోంది..ఈ నెల 28న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంతో నయనతార మరో సక్సెస్‌ని అందుకుంటుందో లేదో చూడాలి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *