తెలంగాణ ఫలితాలు వచ్చేశాయి...నెక్స్ట్ ఏంటి ..?

తెలంగాణ ఫలితాలు వచ్చేశాయి...నెక్స్ట్ ఏంటి ..?

తెలంగాణ ఫలితాలు వచ్చేశాయి…ఎవరూ ఊహించని రీతిలో, బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ప్రతిపక్షంగా ప్రజాకూటమి ఏ దశలోనూ పోటీకి నిలబడలేకపోయింది. కొన్ని కీలక స్థానాల్లో కూడా ఓటమి పాలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

TRS KCR

టీఆర్ఎస్‌కు విజయం వరించేసింది కాబట్టి…ఇక తర్వాత పాలనకు సంబంధించిన కార్యాచరణ ఎలా ఉంటుంది. ఆ విషయాలు తెలుసుకుందాం…ఫలితాలు వచ్చాక ఎన్నికల కమీషన్ విధులు ఎలా ఉంటాయో..!? ఫలితాలు పూర్తిగా వెలువడిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎటువంటి చర్యలు ఉంటాయో తెలుసుకుందాం..!

సీఈఓ ఏం చేస్తారు!?

నియోజకవర్గాల వారిగా ఫలితాలు తెలిసిన వెంటనే రిటర్నింగ్ అధికారి వాటికి సంబంధించిన పత్రాలను ఫ్యాక్స్‌లో హైదరాబాద్‌లోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి పంపిస్తారు. మొత్తం 119 నియోజకవర్గాల ఫలితాల వివరాలను తెలంగాణ సీఈఓ వాటిని క్రమపద్ధతిలో ఉంచి, మొత్తం అన్ని నియోజకవర్గాల ఫలితాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఎన్నికల ప్రధాన అధికారి…ఫలితాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ని జారీ చేయడం జరుగుతుంది. అలాగే, ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్‌కూ, శాసనసభాపతికీ లేదంటే సంబంధిత కార్యాలయానికి పంపిస్తారు.

గవర్నర్‌కు లేఖ…

ఎన్నికల ఫలితాల ఆధారంగా… గవర్నర్ పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన టీఆర్ఎస్ పార్టీనీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ తమ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి నాయకుడిని ఎన్నుకుంటాయి. అలా ఎన్నుకున్న తర్వాత గవర్నర్‌కు లేఖ పంపిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి గవర్నర్ కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖవారు ఏర్పాట్లు చేస్తారు. తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తారు. చివరిగా అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *