ఆ డబ్బుతో నేనేం చేసుకుంటాను!!

ఆ డబ్బుతో నేనేం చేసుకుంటాను!!

సౌత్‌లో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. అమ్మడి క్రేజ్ ఉపయోగించుకోని ఓ సంస్థ క్రేజీ ఆఫర్ ఇచ్చిందట. అయితే తనకు నచ్చితేగానీ ఏది కూడా ఫైనల్ చేయదు. ఈ క్రమంలోనే ఓ బిగ్ ఆఫర్‌ని సింపుల్‌గా రిజెక్ట్ చేసింది ఈ ఫిదా బ్యూటీ. మరి అంతపెద్ద ఆఫర్‌ని రిజెక్ట్ చేయాడానికి కారణం ఎంటో తెలియాలంటే హావ్ ఏ లుక్‌..

ప్రేమ‌మ్‌ సినిమాతో మ‌ల‌యాళ తెర‌పై మెరిసిన సాయి ప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మారింది. త‌న‌ మెస్మరైజింగ్ డ్యాన్స్‌ ఫర్మామేన్స్‌తో పాటు యాక్టింగ్‌తోనూ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోంది. ఇక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటు యాక్టింగ్‌కు ఇంపార్టెంటెంట్ ఉన్న పాత్రలు చెయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అంతేకాదు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను కూడా తిర‌స్క‌రిస్తోంది. 2 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చినా ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో న‌టించేందుకు సాయిప‌ల్ల‌వి అంగీక‌రించ‌లేదట‌.ఈ బ్యూటీ నో చెప్పారన్న వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సూర్యతో నటిస్తున్న ఎన్జీకే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ యాడ్ చేయకపోవడానికి కారణం చెప్పింది. తనకు అవసరానికి మించి డబ్బు అవసరం లేదంటు తన చుట్టూ ఉన్న‌వాళ్లు ఆనందంగా ఉంటేనే తనుకు ఇష్టంమని మోసం చేయడం తనకు అసలు నచ్చదంటు తన మాటలతో అదంరిని ఫిదా చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *