గ్లామర్ పాత్రలకు నో అంటున్న 'దేశముదురు'

గ్లామర్ పాత్రలకు నో అంటున్న 'దేశముదురు'

ఆపిల్ బ్యూటీ హన్సిక తెలుగులో సరైన హిట్ అందుకోలేకపోతుంది.దీంతో ఎక్కువగా కోలీవుడ్ పై ఫోకస్ చేస్తుంది. అక్కడ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. గ్లామర్ బ్యూటీగా కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ దేశముదురు భామ.. ఇక నుండి గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమవ్వాలనుకుంటుంది. యాక్టింగ్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలు ఉన్న సినిమాలతో పాటు లేడి ఓరియేంటెడ్ సినిమాలే చేయాలనుకుంటుందట. ఇప్పటికే రెండు మూడు బిగ్ ఆఫర్స్ వచ్చిన సున్నీతంగా తిరస్కరించిందని తెలుస్తోంది. ఇక తెలుగుతో ఈ బ్యూటీ గోపిచంద్‌తో కలిసి గౌతమ్‌నందా సినిమాలో నటించింది… ఈ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో మరో మూవీ ఓకే చేయలేదు. ఇక్కడ కూడా లేడి ఓరియేంటెడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చే కచ్చితంగా చేస్తానంటుంది ఈ చెన్నై చిన్నది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *