ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌లో ప్రజలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చిన తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చెన్నైలో పలువురు సినీనటులు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటు వేయగా.. సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, ఆయన కుమార్తె, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ చెన్నైలోని ఆల్వార్‌పేటలో క్యూలో నిలుచుని మరి ఓటేశారు. అటు తమిళ సినీ నటులు అజిత్‌, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన ఓటు హక్కు వనియోగించుకున్నారు. సేలంలోని ఎడప్పాడిలో ఆయన ఓటు వేశారు. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఓటు వేయగా.. సినీ నటుడు, బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదిలాఉంటే.. బెంగళూరు సౌత్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓటు వేశారు.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తనయుడు కార్తీ చిదంబరం సతీమణితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో సోలాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *