కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త వివాదం

కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త వివాదం

కర్ణాటకలోని మాండ్యా పార్లమెంట్‌ స్థానం మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ వైపు దివంగత కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్‌ ఫ్యామిలీ, మరోవైపు తాజా ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబం ఈ స్థానంపైనే మనసు పారేసుకుంటుండటంతో.. ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబరీష్ మరణం తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఆయన భార్య సుమలతను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. గతంలో ఆమె భర్త అంబరీష్ ఆ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. దీంతో అక్కడి నుంచి ఆమె పోటీ చేస్తే, సుమలత విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావన నెలకొంటోంది.

Lok Sabha elections 2019

ఇదిలా ఉంటే మాండ్యా నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జేడీఎస్ నేత శివరామ గౌడ ప్రాతినిధ్యంవహిస్తున్నారు. పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా కూడా వదిలుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఇప్పటికే తేల్చిచెప్పింది. పైగా ఆ స్థానం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఎంపీగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాండ్యా నుంచి బరిలోకి దిగుతానని.. ఇవ్వకున్నా స్వతంత్రంగానైనా పోటీచేస్తానని సుమలత ప్రకటించింది. ఇప్పుడు సెంటిమెంట్ సీటు కోసం సుమలత.. మరోవైపు సీఎం కుమారుడు నిఖిల్ మాండ్యా సీటు కోసం పోటీపడుతుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *