రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

వ్యక్తి స్వేచ్ఛా హక్కుని సంపూర్ణంగా మద్దతునిచ్చిన ప్రముఖ రంగస్థల నటుడు, సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో విభిన్న పాత్రలు పోషించిన గిరీష్ కర్నాడ్ ఈ ఉదయం తుది శ్వాస మరణించారు. మహరాష్ట్రలో జన్మించిన గిరీష్ కర్నాడ్ కన్నడ భాషలో ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన రచనలకు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ సహా ఎన్నో అవార్డులను పొందారు. మతాన్ని, హిందూ మతాన్ని ఎప్పటి నుంచో విమర్శిస్తూ వస్తున్నారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను చాలా తీవ్రంగా ఖండించారు. అటు తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికవడాన్ని వ్యతిరేకించారు.

నటుడిగా హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ సినిమాల్లో గిరీష్ కర్నాడ్ 100కు పైగా చిత్రాలకు పనిచేశారు. తెలుగులో సైతం విభిన్నమైన పాత్రలను పోషించారు. ధర్మచక్రం, కొమరం పులి, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో ఆయనను ప్రేక్షకుల నుంచి దూరం చేయని పాత్రలు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *